అర్హులకే సంక్షేమ పథకాలు
ఆసిఫాబాద్: అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్ సమీపంలో రైతు భరోసా పథకంపై నిర్వహిస్తున్న వ్యవసాయ భూముల సర్వేను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి యోగ్యమయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని సూచించారు. పట్టణంలో పలుచోట్ల కూరగాయలు విక్రయిస్తుండటంతో జూబ్లీ మార్కెట్‌లో వ్యాపారాలు సాగడం లేదని పలువురు వ్యాపారులు కలెక్టర్‌కు తెలిపారు. దీంతో సంబంధిత అధికారులతో చర్చించి, సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం జన్కాపూర్‌లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, వ్యవసాయాధికారి మిలింద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులకే అందాలి
కెరమెరి(ఆసిఫాబాద్): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సూపర్ చెక్, ఎస్‌బీఎం కాంప్లెక్స్ మరుగుదొడ్ల మార్కింగ్, సాకడ గ్రామంలో రైతు భరోసా, రేషన్ కార్డుల క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్‌బీఎం కాంప్లెక్స్ టాయిలెట్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. అనంతరం గోయగాం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎండీఎం, వంటగదులు, భోజన నాణ్యత, రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీడీవో అమ్జద్‌పాషా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment