సీపీఎం మహాసభలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఈనెల 25వ నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్ కోరా రు. శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ ప్రభుత్వంతో పోరాడుతోందని తెలిపారు. జిల్లాలో పోడు రైతుల పక్షాన పోరాడి పట్టాలు ఇప్పించినట్లు పేర్కొన్నారు. పులి పేరిట తునికాకు సేకరణ చేయొద్దని జిల్లా అటవీ శాఖ అధికారులు సంబంధిత రాష్ట్ర అధికారులకు తెలియజేసిన వెంటనే సమస్య పరిష్కారంలో ముందు నిలిచిందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన ఘనత సీపీఎంకే దక్కుతుందని పేర్కొన్నారు. పార్టీ మహాసభలకు పోలిట్ భ్యూరో సభ్యులు బృందాకారత్, బీవీ రాఘవులు, కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారని తెలిపా రు. మహాసభలను విజయవంతం చేయాలని కో రారు. జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమి టీ సభ్యులు ఆనంద్, రాజేందర్, టీకానంద్, మా లశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment