చప్రాడాకు మహాపాదయాత్ర
బెజ్జూర్: మండలంలోని ఎల్కపల్లి(బీ) అభయాంజనేయస్వామి ఆలయం నుంచి మహా రాష్ట్రలోని చప్రాడాలోగల దత్తవార్ కార్తీకస్వామి మహరాజ్ ఆలయం వరకు 20వ మహా పాదయాత్ర కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. బెజ్జూర్, కుకుడ, బారెగూడ, రుద్రపూర్, చింతలమానెపల్లి, అనుకోడ, రవీంద్రనగర్, తుమ్డిహేటి గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నా రు. భక్తులకు కేశెట్టి శ్రీనివాస్, సామల వెంకటేశం, మాజీ ఎంపీటీసీ సుల్తానా జావీద్ అల్పాహారం అందజేశారు. చప్రాడా ఆలయంలో భక్తులకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బా బు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ స భ్యుడు సుధాకర్‌రావు, ఎల్కపల్లి ఆలయ కమి టీ అధ్యక్షుడు రామకృష్ణ, కంకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య, రంగనాయక ఆలయ కమిటీ చైర్మన్ తంగిడెపల్లి మహేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీవర్ధన్, నిర్వాహకులు భాస్కర్‌రాజు, పుల్లూరి సతీశ్, సామల తిరుపతి, దిగంబర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment