జాతీయస్థాయి పోటీల రిఫరీ బోర్డు చైర్మన్‌గా నారాయణరెడ్డి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఈ నెల 17నుంచి 21వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా నారఖేర్‌లో నిర్వహించనున్న 69వ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ రిఫరీ బోర్డు చైర్మన్‌గా మండలంలోని గోలేటికి చెందిన ఆర్.నారాయణ రెడ్డి వ్యవహరించనున్నట్లు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సింగం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, షార్ప్ స్టార్ బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి శంకర్, సెపక్ తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు భాస్కర్, రామకృష్ణ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment