‘ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి’
కౌటాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. శనివారం కౌ టాల మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కౌటాల వార సంతలో ప్రజల సౌకర్యార్థం రూ. 3.5 లక్షల నిధులతో మూత్రశాలల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బసర్కార్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, టీపీసీసీ సభ్యులు అర్షద్ హుస్సేన్, నాయకులు ఉమా మహేశ్, తిరుపతి, రవీందర్‌గౌడ్, డబ్బా బాపు, ఖాళీం పాషా, గట్టయ్య, బండు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment