శృంగేరి పీఠానికి హంసలదీవి ఆలయం
కోడూరు: హంసలదీవి లోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని శృంగేరి పీఠం దత్తత తీసుకుంది. పీఠానికి బుధవారం రికార్డులు అప్పగించారు.
మరో అవకాశం..
గురువారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2023
–IIలోu
పామర్రు: సామాజిక సాధికార బస్సు యాత్రకు పామర్రు నియోజకవర్గం సర్వసన్నద్ధం అయింది. నియోజకవర్గ కేంద్రమైన పామర్రులో గురువారం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర పురస్కరించుకుని పామర్రులో అన్ని ప్రధాన కూడళ్లూ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, వైఎస్సార్‌సీపీ జెండాలతో నిండిపోయాయి. ముఖ్యంగా గ్రామంలోని విజయవాడ రోడ్డులో శ్రీప్రియ అపార్టుమెంట్స్ వద్ద నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న నాలుగురోడ్ల కూడలి వరకు వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలతో నింపేశారు. బస్సు యాత్ర గురించి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పామర్రు శాసనసభ్యుడు కై లే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాయి.
యాత్రలో పాల్గొనే మంత్రులు, ఎంపీలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్రలో రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), సింహాద్రి రమేష్‌బాబు, కొలుసు పార్థసారథి, పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పాల్గొంటారని ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ తెలిపారు. పామర్రు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా బస్సుయాత్రకు తరలివచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
రహదారుల వెంబడి ఏర్పాటుచేసిన స్వాగత ఫ్లెక్సీలు
కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు
న్యూస్‌రీల్
నేడు పామర్రులో సామాజిక సాధికార బస్సు యాత్ర అడుగడుగునా రెపరెపలాడుతున్నవైఎస్సార్ సీపీ జెండాలు, ఫ్లెక్సీలు పామర్రులో పండుగ వాతావరణం బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
బడుగుల కోట పామర్రులో గురువారం సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ప్రధానంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం గత నాలుగైదు దశాబ్దాలుగా ఎస్సీలకే రిజర్వు అవుతూ వస్తోంది. గతంలో నిడుమోలు పేరుతో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక ఈ నాలుగున్నరేళ్లుగా బడుగు, బలహీన వర్గాలకు చేసిన మేలును ఆయా వర్గాలకు తెలియజేసి చైతన్యపరిచేందుకు ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.
పామర్రు శాసనసభ్యుడు కై లే అనిల్‌కుమార్
పామర్రు: నియోజకవర్గ కేంద్రమైన పామర్రులో గురువారం సాయంత్రం నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పామర్రు శాసనసభ్యుడు కై లే అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బడుగులకు రాజ్యాధికారం అందించే దిశగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతలను వివరించేందుకు ఈ బస్సుయాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు.
బస్సు యాత్ర సాగుతుందిలా...
గురువారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2 గంటల వరకు స్థానిక ఆర్ అండ్ బీ గెస్టు హౌస్‌లో బస. తర్వాత 2 నుంచి 2.30 గంటల వరకు విజయవాడ రోడ్డులోని శ్రీప్రియ టవర్స్ వద్ద పార్టీ లోని బడుగు బలహీన వర్గాల నాయకులతో సమావేశం. 2.30 నుంచి 3.30 గంటల వరకు విజయవాడ రోడ్డులోని శ్రీప్రియ టవర్స్ నుంచి పామర్రు నాలుగురోడ్ల కూడలి వరకు పాదయాత్ర. 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పామర్రులోని నాలుగురోడ్ల కూడలి వద్ద బహిరంగ సభ.
Comments
Please login to add a commentAdd a comment