పరిశుభ్రతే స్వచ్ఛాంధ్ర లక్ష్యం
రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
ఉయ్యూరు: పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. మండలంలోని కాటూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. గ్రామంలోని రహదారులు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. సచివాలయం సమీపంలో మొక్కలు నాటారు. సంపద కేంద్రాన్ని సందర్శించి తడి చెత్త – పొడి చెత్తను పరిశీలించారు. ఇంటింటికీ డస్ట్‌బిన్లను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు ప్రజలతో మమేకమయ్యారు. స్వచ్చాంధ్ర లక్ష్యాలను వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయా నంద్ మాట్లాడుతూ.. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. ప్రతి నెలలోనూ మూడో శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, సిబ్బంది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్త నుంచి సంపద సృష్టిలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలన్నారు. వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టడానికి పది రకాల కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీపీఓ అరుణ, డ్వామా పీడీ శివప్రసాద్, ఆర్డీఓ హెలా షారోన్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీఓ శేషగిరిరావు, సర్పంచ్ కొడాలి ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment