కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
ప్రమాదంలో
భారత రాజ్యాంగం
పుస్తకావిష్కరణ సభలో వక్తలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న మాట వాస్తవమేనని, అంతకంటే ముందు మనిషే ప్రమాదంలో ఉన్నాడని పలువురు వక్తలు పేర్కొన్నారు. హనుమాన్‌పేటలోని ఆలపాటి ఫంక్షన్ హాల్‌లో కాట్రగడ్డ వెంకటేశ్వరరావు స్మారక రాజ్యాంగ పరిరక్షణ వేదికపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన ‘దేశం ఎటుపోతోంది’ పుస్తకావిష్కరణ శనివారం జరిగింది. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘రాజ్యాంగానికి ప్రమాదం – పరిరక్షించుకోవాలి ప్రజలందరు’పై చర్చాగోష్టి జరిగింది. ఏఐఎల్‌యూ జాతీయ ఉపాధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, డి.వి.వి.ఎస్.శర్మ మాట్లాడుతూ.. జర్నలిస్టులు, హేతువాదులపై దాడులు, అక్రమ అరెస్టులు బాధాకరమన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పుస్తక రచన ఆవశ్యకతను వివరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉమాహేశ్వరరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు అన్నిరకాల అన్యాయం చేసిన అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర పర్యటనకు వస్తున్నా రని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్. బాబురావు, రైతు ఉద్యమ నాయకులు చుండూరు రంగారావు, కె.వి.వి.ప్రసాద్, మనోరమ, అడబాల లక్ష్మి, కాట్రగడ్డ రజనీకాంత్, డి.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, మచిలీపట్నం: ‘సార్.. మా కుటుంబ సభ్యులందరం గత ఎన్నికల్లో మీ కోసం పనిచేశాం. మీరేమో ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం చేయలేదు. ఇప్పుడు నా భార్య పేరున రేషన్ షాపు అయినా మంజూరు చేయండి. గతంలోనే మిమ్మల్ని కలిసి విన్నవించాను. మీరేమో మరొకరికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా మాకే దక్కేలా చూడండి’.. అంటూ గూడూరుకు చెందిన ఓ అధికార పార్టీ కార్యకర్త తమ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి విన్నవించుకున్నాడు. ‘ఇప్పటికే అధికారులతో మాట్లాడాను. నా పరిధిలోని షాపులన్నీ కచ్చితంగా మావాళ్లకే చేయాలని చెప్పాను’ అని ఆ ప్రజా ప్రతినిధి అభయం ఇచ్చారని సమాచారం. ప్రజా పంపిణీ వ్యవస్థలోని చౌక ధరల దుకాణాలను తమ కార్యకర్తలకు కట్టుబెట్టేందుకు కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ షాపులను ఇప్పటికే గుర్తించిన రెవెన్యూ అధికారులు, వాటికి డీలర్లను నియమించేందుకు గత నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. రెవెన్యూ డివిజినల్ అధికారులు తమ పరిధిలోని మండలాల్లో భర్తీ చేయబోయే ఖాళీల వివరాలతో ప్రకటనలు ఇచ్చారు. జిల్లాలోని నిరుద్యోగులు వాటిపై గంపెడాశతో దరఖాస్తు చేసుకున్నారు. అధి కార పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ చౌక దుకాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పరీక్ష తేదీ ప్రకటన
చౌక దుకాణాల నిర్వహణ కోసం జారీ చేసిన ప్రకటన ఆధారంగా వచ్చిన దరఖాస్తుదారులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. గత డిసెంబర్ 21వ తేదీన జరగాల్సిన రాత పరీక్షను మచిలీపట్నం డివిజన్‌లో వాయిదా వేశారు. ఆ రోజు ఉదయం పది గంటలకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అదే రోజు ఆర్డీఓ ప్రకటన జారీ చేశారు. అత్యవసరంగా ఎందుకు వాయిదా వేశారో స్పష్టమైన కారణం మాత్రం చెప్పలేదు. తాజాగా శనివారం ఈ పరీక్ష జరిగింది. ఉయ్యూరు, గుడివాడలో గత నెల 21వ తేదీనే పరీక్ష నిర్వహించారు. ఫలితాలను మాత్రం వెల్లడించలేదు.
వ్యవస్థను పటిష్టం చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ప్రజా పంపిణీ వ్యవస్థను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఒకవైపు రేషన్ షాపులతో పాటు మినీ వాహనాలు (మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్)తో వీధి వీధి తిరిగి ప్రజలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా యూనిట్లు మంజూరు చేసి, ప్రజలకు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది.
7
న్యూస్‌రీల్
కృష్ణా జిల్లాలో 120 చౌకదుకాణాల ఏర్పాటుకు కసరత్తు మండలాల వారీగా ఖాళీలను ప్రకటించిన ఆర్డీఓలు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తామని ప్రకటన షాపుల కోసం నేతల చుట్టూ కూటమి కార్యకర్తల ప్రదక్షిణలు అన్నీ తమ అనుచరులకు కట్టబెట్టేందుకు నేతల కసరత్తు
పేరుకే పరీక్ష..?
రేషన్ షాపుల డీలర్ల నియామకం కోసం అధికారులు చేపట్టిన ప్రక్రియ రెండు దశల్లో చేయాల్సి ఉంది. ముందుగా దరఖాస్తుదారులకు రాత పరీక్ష నిర్వహించాలి. మరో రోజు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) చేపట్టాలి. అయితే రెండు పరీక్షలు పేరుకే నామమాత్రంగా నిర్వహిస్తున్నారని, రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిన వారినే ఖరారు చేస్తారనే చర్చ జరుగుతోంది. ప్రాంతాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల వివరాలను ఇప్పటికే మండల, రెవెన్యూ అధికారులు వెల్లడించడంతో ఆయా ప్రాంతాలకు చెందిన కూటమి కార్యకర్తలు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
పారదర్శకంగా ఎంపిక
జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ షాపుల నిర్వహణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్డీఓల పర్యవేక్షణలో రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆర్డీఓలు నోటిఫికేషన్లు జారీ చేయ డంతో పాటు మిగతా ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– వి.పార్వతి, డీఎస్‌ఓ, కృష్ణా జిల్లా
డివిజన్ల వారీగా వివరాలు
డివిజన్ పేరు మొత్తం ఖాళీగా ఉన్న వచ్చిన
షాపుల సంఖ్య షాపులు దరఖాస్తులు
మచిలీపట్నం 307 45 117
గుడివాడ 471 46 88
ఉయ్యూరు 281 29 103
మొత్తం 1059 120 308
Comments
Please login to add a commentAdd a comment