త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు ప్రారంభం
విజయవాడకల్చరల్: హంసధ్వని చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో పటమట దత్తాశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ క్షేత్రంలో నాలుగు రోజులపాటు నిర్వహించే శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీతోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. సంగీత విద్వాంసులు హంసధ్వని చారిటబుల్ సంస్థ నిర్వాహకుడు యనమండ్ర శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలను మధురంగా ఆలపించారు.
ఆలపించిన త్యాగరాజ కృతులు
త్యాగరాజస్వామి కీర్తనల పరిశోధకుడు ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి త్యాగరాజ దర్శనం అంశంగా ప్రసంగించారు. ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ మల్లాది సూరిబాబు త్యాగరాజస్వామి కృతులను ఆలపించారు. అంబటిపూటి కామాక్షి వయోలిన్‌పై, బీవీఎస్ ప్రసాద్ మృదంగంపై, కానూరి వెంకటరామకృష్ణ ఘటంపై సహకరించారు. హంసధ్వని చారిటబుల్ సంస్థ నిర్వాహకులు రామశాస్త్రి, వేద పండితులు గోపీకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment