సర్వం కోల్పోయాం... ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

సర్వం కోల్పోయాం... ఆదుకోండి

Published Sun, Nov 3 2024 1:58 AM | Last Updated on Sun, Nov 3 2024 1:58 AM

-

వరద బాధితుల ఆవేదన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బుడమేరు వరదల కారణంగా సర్వం కోల్పోయాం.. ఆదుకోండని వరద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శనివారం గవర్నర్‌పేటలోని శ్రీ శ్రీ భవన్‌లో వరద బాధితులతో కలిసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సింగ్‌నగర్‌కు చెందిన పలువురు బుడమేరు వదర ముంపు ప్రాంత వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. కురగండి డానియేల్‌ తాను కలెక్టర్‌ కార్యాలయంలో ఆరు సార్లు అర్జీ ఇచ్చానని, సాయం అందలేదని వాపోయాడు. తమను ఏ ఒక్కరు పట్టించుకోలేదని మరో బాధితుడు సత్యనారాయణ తనకు జరిగిన నష్టాన్ని వివరించాడు. బుడమేరు సమస్య పరిష్కారానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని సీహెచ్‌బాబూరావు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారని, వరద సాయం మాత్రం అందించలేదన్నారు. సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement