ఈ సమస్యల పరిష్కారానికి ఇటీవల కమిషనర్ బాపి రాజుకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఆస్తి, ఖాళీ స్థలాలు, తాగునీటి పన్నులు చెల్లించే నగర వాసులకు రూ. రెండు లక్షల వ్యయంతో ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేందుకు కౌన్సిల్ అజెండాలో పెట్టిన అంశాన్ని పాలకవర్గం ఇటీవల జరిగిన సమావేశంలో తిరస్కరించింది. ఈ నిధులతో ముందు ఎంఎంసీ కార్యాలయంలోని ఉద్యోగుల తాగునీటి ఇబ్బంది, మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించాలని అధికార వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌లు కమిషనర్ బాపిరాజుకు సూచించారు. కానీ ఇది ఆచరణలో పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment