మధురానగర్(విజయవాడసెంట్రల్): న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవాలకు రాష్ట్రం తరఫున పదిమంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎంపికై నట్లు ఏపీ ఎన్‌ఎస్‌ఎస్ కంటింజెంట్ లీడర్ డాక్టర్ కొల్లేటి రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన ప్రీ రిపబ్లిక్ డే కార్యక్రమంలో రాష్ట్రం నుంచి 44 మంది పాల్గొన్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పదిమంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 30న ఢిల్లీ బయలుదేరి ఫిబ్రవరి 2న రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment