మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థుల ప్ర
గుడివాడటౌన్: హోమిబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ గత నెల 3వ తేదీన విజయవాడలో నిర్వహించిన రీజనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (ఆర్‌ఎంఓ) 2వ లెవల్ పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు 9 మంది విజయం సాధించి 3వ స్థాయి పోటీలకు అర్హత సాధించారని కేకేఆర్ గౌతమ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ఫ్యాక్ట్ ప్రిన్సిపాల్ ఎం.రామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థులు సీహెచ్. ఉజ్వల్‌రామ్, పి.నవదీప్, వీవీ కౌషిక్‌రెడ్డి, పి.బిందుభార్గవ్, కె.నిహాల్ రెడ్డి, బి.కీర్తన్ రెడ్డి, డి.రిషితారెడ్డి, కె.ప్రేమ్‌చంద్, బి.గురుదీప్ రెడ్డి విజయం సాధించి జనవరి 19న జరగనున్న ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ (ఐఎన్‌ఎంఓ) పోటీ పరీక్షలకు అర్హత సాధించారన్నారు. ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను ప్రిన్సిపాల్స్ ఎం.సత్యారామ్, పి.లక్ష్మీ ప్రసాద్, కె.జ్యోతి, ప్రశాంతి, ఉపాధ్యాయులు అభినందించారు.
చెట్టు పైనుంచి జారిపడి
యువకుడి దుర్మరణం
పెడన: మామిడి చెట్టు పైనుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పెడన మండలం చేవెండ్ర గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పెడన పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన స్నేహితుడి వివాహానికి మామిడి ఆకులు ఆవసరమై చేవెండ్ర గ్రామానికి చెందిన గాజుల లక్ష్మీనాగరాజు(33) శుక్రవారం సాయంత్రం కాలువ గట్టుపై ఉన్న మామిడి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి కాలు జారి కిందపడిపోయాడు. కింద ఉన్న వారు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వీర హనుమాన్‌బాబు ఫిర్యాదు మేరకు పెడన ఏఎస్‌ఐ టి.సురేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర కబడ్టీ పోటీల్లో
కృష్ణాజిల్లా జట్ల సత్తా
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి 71వ సీనియర్ సీ్త్ర, పురుషుల కబడ్డీ పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లు సత్తా చాటాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎస్‌ఎస్‌కేసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కృష్ణాజిల్లా మహిళల జట్టు అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించి విన్నర్ ట్రోఫీని కై వసం చేసుకుంది. జిల్లా పురుషుల జట్టు మూడో స్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన జట్లను ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నాంచారయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పి.రవి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment