శబరిమలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Published Sun, Dec 15 2024 1:35 AM | Last Updated on Sun, Dec 15 2024 1:35 AM

-

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ డివిజన్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ మండురూపకర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌ నంబర్‌07175)రైలు ఈనెల 19, 26 తేదీలలో సికింద్రాబాద్‌లో గురువారం రాత్రి 8 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజామున 1.30 కు కొల్లం చేరుతుంది. కాకినాడ పోర్టు నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌ నంబర్‌07173) ఈనెల 18,25 తేదీలలో బుధవారం రాత్రి 11.50కి కాకినాడ పోర్టులో బయలు దేరి శుక్రవారం ఉదయం 5.30కు కొల్లం చేరుతుంది. విజయవాడ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌ నంబర్‌07177) 21, 28 తేదీలలో విజయవాడలో శనివారం రాత్రి 10.15కు బయలుదేరి సోమవారం ఉదయం 6.20కి కొల్లం చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement