ఎస్‌జీఎఫ్ అండర్–19 వాలీబాల్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్)అండర్–19 వాలీబాల్ బాలుర రాష్ట్ర జట్టును స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తి రాజు గురువారం ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఎర్రయ్య, సతీష్, రెహాన్, జస్వంత్, ప్రసాద్, ఆదిత్య, సాయి ప్రతాప్, హ్యాపీ, మహేష్, లక్ష్మణ, అప్పన్న, మదన్ సాయి జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. ఈ జట్టుకు వారం రోజుల పాటు క్యాంప్ నిర్వహించామని, ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే 68వ జాతీయ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. జట్టుకు కోచ్ గా రవీందర్, మేనేజరుగా రత్నం వ్యవహరిస్తున్నారని తెలిపారు. జాతీయ పోటీల్లో రాష్ట్రానికి పతకం తీసుకురావాలని ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి వి.రవికాంత జట్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment