ఉంగుటూరు: శానిటైజర్ తాగిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన మానికొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన షేక్ మియాజాని తాపీ పని కార్మికుడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 7గంటలకు మియాజాని తాపీ పనికి వెళ్లాడు. అదే రోజు ఉదయం 10గంటలకు అతని భార్యా మియాజానికి ఫోన్ చేసి పెద్ద వాడైన షేక్ ఖలీల్‌బాష(24)కు ఆరోగ్యం బాగోలేదని అతనిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నట్లు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే వైద్యులు తన కుమారునికి చికిత్సనందిస్తున్నారు. తన కుమారుడుకి ఏమైందని అడుగగా శానిటైజర్ తాగాడని చెప్పారు. షేక్ ఖలీల్ బాషా చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉంగుటూరు ఎస్సై యు.గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment