సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వంలో సంక్షేమం చట్టుబండలైంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదు. పేదల పథకాల అమలు పూర్తిగా నిలిపివేసింది. ఈ ఏడాది ఆరంభంలో సంక్షేమ వెలుగుల్లో ఉన్న ప్రజల జీవితాల్లో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి. తమకు బాసటగా ఉంటాయనుకున్న సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలుచేయకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉన్న పథకాలను సైతం రద్దు చేసే దిశగా పావులు కదపడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి హయాంలో సంక్షేమ యజ్ఞ కాంతులు చెదిరిపోయాయి. ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ఎన్నో రకాల హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేటితో 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజల జీవితాల్లో సంక్షేమ సంక్రాంతి కాంతులు వెదజల్లాయి. ప్రభుత్వం నుంచి రూ.వందల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా పేద, సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలు ఆనందంగా పెద్ద పండుగను జరుపుకున్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు లాభాలతో కళకళలాడాయి. మే వరకు ప్రజోపయోగ పాలన సాగింది. గత ఐదేళ్లు సంక్షేమ సర్కారుగా మన్ననలు పొందింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది. మోసాల కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. సంక్షేమానికి చెదలు పట్టింది. ఎన్నికల్లో వారు హామీలిచ్చిన పథకాలు, సూపర్‌సిక్స్‌ల హామీల గురించి ఊసెత్తడం లేదు. దీంతో అన్ని సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. దీనికితోడు నిత్యావసర ధరలు సైతం భారీగా పెరిగాయి. పేద వర్గాలు కొనుగోలు శక్తి లేక డీలా పడిపోయాయి. అన్ని రకాల వ్యాపార లావాదేవీలు తగ్గిపోయాయి. దీనికితోడు ప్రకృతి వైపరీత్యాలు కోలుకొలేని దెబ్బ తీశాయి.
గత ఐదేళ్ల పాలనలో సంక్షేమ కాంతులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్లు కాంతులు వెదజల్లింది. ఇచ్చిన హామీలన్నింటిని క్యాలెండర్ ప్రకారం అమలు చేసింది. ఐదేళ్లలో జగనన్న అమ్మ ఒడి 14,84,817 మంది లబ్ధిదారులకు రూ. 2,227.28 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 6,43 738 రైతులకు రూ.815.45 కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా 2,69,656 మంది లబ్ధిదారులకు రూ.505.62 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 3,09,447 మంది లబ్ధిదారులకు రూ.356.7కోట్లు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద 1,41,295 మంది లబ్ధిదారులకు రూ.4,238.80 కోట్లు, వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 10,44,974 మంది లబ్ధిదారులకు రూ.3,070.32 కోట్లు ఇలా ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 31 రకాల పథకాల ద్వారా 72,20,324 మంది లబ్ధిదారులకు 12069.39 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరింది.
అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూపులు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు ఏడాదికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని ప్రకటించారు. అయితే బడ్జెట్‌లో మాత్రం అరకొరగానే నిధులు కేటాయించడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. రైతులు ఎన్టీఆర్ జిల్లాలో 1,41,726 మంది రైతులు, కృష్ణా జిల్లాలో 2.70 లక్షల మంది ఎదురు చూస్తున్నారు.
నిరుద్యోగులకు భృతి నిల్....
ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామిల్లో తాము అధికారం చేపట్టగానే వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని, లేదా నిరుద్యోగ భృతికింద నెలకు రూ3వేలు ఇస్తామని హామి ఇచ్చారు. అయితే నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవు. ఇంటికొ ఉద్యోగం అంటే...ఎన్టీఆర్ జిల్లాలో 6,09,032 కుటుంబాలు, కృష్ణా జిల్లాలో 8 లక్షల కుటుంబాలకు తీవ్ర నిరాశే మిగిల్చింది.
నేటితో ముగియనున్న 2024 సంవత్సరం ఈ ఏడాది ప్రారంభంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమ సంక్రాంతి పేదలకు ఆసరాగా నిలిచిన పథకాలు కూటమి పాలనలో నిలిచిన సంక్షేమ పథకాలు
ఉచిత బస్సు ఊసేలేదు....
ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చింది. కానీ బడ్జెట్‌లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 9.70 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 9 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరంతా ఉచిత బస్సు కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.
బుడమేరు
కూటమి మోసంపై నిట్టూర్పు...
మొత్తం మీద గత వైఎస్సార్ సీపీ పాలనను, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో తీపి గుర్తులను తలచుకొంటున్నారు. కూటమి ప్రభుత్వం మోసం చేసిందని నిట్టూరుస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.
తల్లికి వందనం ఏదీ..?
సెప్టెంబరు నెలలో వచ్చిన బుడమేరు వరదలకు బెజవాడలో సగం భాగం నీట మునిగింది. పదిరోజులకు పైగా వరదలో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు విలవిల్లాడారు. విజయవాడలోని 32 డివిజన్‌లలో 2.69 లక్షల కుటుంబాలను వరద కాటేసింది. బుడమేరు చేసిన వరద గాయం నుంచి బెజవాడ నేటికీ కోలుకోలేదు. అన్నదాతలకు సైతం చేదు జ్ఞాపకాలే మిగిల్చింది. ఉచిత ఇసుక పేరుతో వినియోగదారులను కూటమి ప్రభుత్వం దగా చేసింది. మద్యం ధరలు తగ్గిస్తామని మభ్య పెడుతూ పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి, పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుతోంది.
Comments
Please login to add a commentAdd a comment