ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి
కర్నూలు(సెంట్రల్): సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా సూచించారు. మంగళవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో హమారా శౌచాలయ్–హమారా సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచిన కార్మికులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు చేపట్టిన ప్రపంచ మరుగుదొడ్ల అవగాహన కార్యక్రమాలు ముగిసినట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి వ్యక్తిగత, కమ్యూనిటీ మరుగుదొడ్లను శుభ్రం చేసిన 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు అందించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లను వినియోగించేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రుల్లో మరమ్మతులకు గురైన టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. అనంతరం గూడూరు మండలం జూలకల్ గ్రామానికి చెందిన జె.వెంకటమ్మ, కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన రెడ్డిపోగు సోమన్న, రేమటకు చెందిన ఎం.రత్నాకర్, వెల్దుర్తి మండలం బోగోలుకు చెందిన ఈ.లక్ష్మీదేవి, కలుగోట్లకు చెందిన పార్వతమ్మ, కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన షేక్ పర్వీన్, పెద్ద టేకూరుకు చెందిన కె.భిక్షు, గోనెగండ్ల మండలం గంజహాల్లికి చెందిన సి.మహేశ్వరి, కున్నూరుకు చెందిన బి. కృష్ణవేణి, తుగ్గలి మండల కేంద్రానికి చెందిన రత్నమ్మకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
ముగిసిన ప్రపంచ టాయిలెట్ల
దినోత్సవ అవగాహన కార్యక్రమాలు
ఉత్తమ టాయిలెట్ల నిర్వహణకు
పురస్కారాలు అందజేసిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment