రైల్వే అండర్ బ్రిడ్జి పనుల నిలిపివేత
హాలహర్వి: మండలంలోని చాకిబండ గ్రామ శ్మశానంలో చేపడుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను మంగళవారం నిలిపేశారు. పనులు ఆపాలని ఇటీవల సర్పంచ్ ఓబుళపతి ఆధ్వర్యంలో గ్రామస్తులు అధికారులను కోరారు. ఈక్రమంలో మంగళవారం రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరింగ్ అధికారి రామప్రసాద్, రైల్వే సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు. వారి విన్నపం మేరకు పనులను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని ప్రకటించారు. తదుపరి పనులు గ్రామస్తులకు తెలియజేసిన తర్వాతే చేపడతామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నగేష్, వీఆర్వో పెద్నన్న, సర్పంచ్ ఓబుళపతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment