నాణ్యతను బట్టి ధర
మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల దాకా టమాట సరుకు వస్తోంది. టమాట నాణ్యతను బట్టి ధర పలుకుతోంది. చిన్న గోలీ సైజు టమాట ధర తక్కువగా పలుకుతోంది. సరుకు బాగుంటే ధర కూడా ఉంటుంది.
– కార్నలిస్, మార్కెట్ యార్డు కార్యదర్శి, పత్తికొండ
ఖర్చులు కూడా రాలేదు
ఎకరా పొలంలో టమాట సాగు చేశా. ప్రతికూల వాతావరణంలో పంటకు తెగుళ్లు సోకాయి. వాటి నుంచి వేలకు వేలు ఖర్చుచేసి పంటను కాపాడుకుంటే ఇప్పుడు ధరలు పడిపోయాయి. 10 గంపలు(గంప 25కేజీలు)మార్కెట్‌కు తీసుకెళితే రూ.400 వచ్చింది. ఆటో బాడుగ రూ.250, కమీషన్ రూ.40 పోను రూ.110 మిగిలింది. కూలీ ఖర్చులు కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలి. – పక్కీరప్ప, రైతు, గిరిగెట్ల
Comments
Please login to add a commentAdd a comment