ఆళ్లగడ్డ: ఆస్తుల తగాదాలతో తల్లి, కొడుకుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. నల్లగట్ల గ్రామంలో శనివారం రాత్రి నాగరాజు భార్య హైమావతి, కొడుకు మాధవ్‌లపై నాగరాజు అన్న వెంకటరమణ కుటుంబ సభ్యులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వెంకటరమణ, అతని కొడుకు సాయి, భార్య మల్లేశ్వరిలతోపాటు మామ మద్దిలేటిలను మంగళవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని ఎస్‌ఐ తెలిపారు
ఉపాధి కూలీలపై
తేనెటీగల దాడి
మద్దికెర: మండల పరిధిలోని మదనంతపురం గ్రా మంలో మంగళవారం ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి చేయడంతో ఏగుడురికి గాయాలయ్యాయి. గ్రామ పరిసరాల్లో రోజు మాదిరిగానే ఉపాధి పను లు చేస్తుండగా తేనెటీగలు దాడి చేయడంతో చిన్న మల్లికార్జున, నారాయణ, ఈశ్వరమ్మ, రంగమ్మ రా మాంజులు, కేశమ్మ, మద్దిలేటికి గాయాలు కావడంతో వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment