శ్రీమఠంలో రేవంత్ సోదరుడు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సో దరుడు ఎనముల జగదీశ్వర్‌రెడ్డి మంగళవారం మంత్రాలయం వచ్చారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వా మి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆయనకు శేషవస్త్రం కప్పి, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వదించారు.
థియేటర్‌లో
యువకుల ఘర్షణ
వెలుగోడు: పట్టణంలోని రంగమహల్ థియేటర్‌లో సోమవారం రాత్రి పుష్ప సినిమా షోలో రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వర్గానికి చెందిన యువకుడిపై మరో వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. బాధిత వర్గ యువకులు మంగళవారం జమ్మి నగర్ వద్ద ప్రత్యర్తి వర్గంపై దాడి చేశారు. అనంతరం ఇరు వర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే తమ ఫిర్యాదును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని గిరిజన వర్గానికి చెందిన యువకులు ఎస్‌ఐ విష్ణు నారాయణను ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ విషయమై ఎస్‌ఐ మాట్లాడుతూ ఇరువర్గాలపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
అధ్యాపకుడికి మెమో
డోన్ టౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు మోహన్‌నాయక్‌కు మెమో జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ భారతి తెలిపారు. పరీక్ష కేంద్రలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడమే గాకా ఫోన్ మాట్లాడుతుండగా మందలించిన ప్రిన్సిపాల్‌పైనే దురుసుగా వ్యవహరించిన అధ్యాపకుడి విషయమై ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆమె స్పందించారు. వివరణ కోరుతూ మెమో జారీ చేశారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
29న ఓపెన్ తైక్వాండో పోటీలు
కర్నూలు (టౌన్): ఈనెల 29న స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం పక్కన ఉన్న కర్నూలు క్లబ్‌లో షటీల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి టీ.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్స్ విబాగాల్లో బాల బాలికలకు పోటీలు ఉంటాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో వెంట తీసుకు రావాలని తెలిపారు. ప్రతిభ చాటిన విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment