ఎస్సీ ఉప–వర్గీకరణపై వినతుల స్వీకరణ
కర్నూలు(అర్బన్): షెడ్యూల్డ్ కులాల్లోని ఉప–వర్గీకరణకు సంబంధించి ఏవైనా వినతులను 2025 జనవరి 9లోగా అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.తులసీదేవి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిందన్నారు. ఈ కమిషన్ కార్యాలయాన్ని విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తు, కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజాపురంలో ఏర్పాటు చేశారన్నారు. వర్గీకరణకు సంబంధించిన వినతులను కార్యాలయ పనివేళల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల్లోపు వ్యక్తిగతంగా కానీ, తిరుగు రసీదుతో రిజిస్టర్ పోస్టు ద్వారా లేక ఈమెయిల్ ఐడీ : omcscsubclassification@gmail.com ద్వారా సమర్పించవచ్చన్నారు.
ఉద్యోగ మేళాకు విశేష స్పందన
నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 106 మంది నిరుద్యోగులు హాజరు కాగా 52 మంది ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంతరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment