అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
కోవెలకుంట్ల: మండలంలోని పెద్ద కొప్పెర్లకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రేవనూరు ఎస్‌ఐ భూపాలుడు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బాలసుబ్బరాయుడు(55) బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. తిరిగి చెల్లిచలేక పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బంధువులు గమనించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడి బలవన్మరణం
ఆదోని అర్బన్: స్థానిక ప్రశాంత్‌నగర్‌లో నివాసముందే మహాదేవ్, ఈరమ్మ దంపతుల కుమారుడు గోపాల్(28) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. గోపాల్ గోబీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగించేవాడు. నాలుగేళ్లుగా పద్మ అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా గోపాల్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
మహానంది: నంద్యాల–గిద్దలూరు రైల్వేమార్గంలో నందిపల్లె, నంద్యాల రైల్వేస్టేషన్ల మధ్యలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్‌ఐ అబ్దుల్ జలీల్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రైలుప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేనందున గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment