నేటి నుంచి డిపార్టుమెంటల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డిపార్టుమెంటల్‌ పరీక్షలు

Published Wed, Dec 18 2024 1:53 AM | Last Updated on Wed, Dec 18 2024 1:53 AM

-

కర్నూలు(సెంట్రల్‌): డిపార్టుమెంటల్‌ పరీక్షలను బుధవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్‌, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దూపాడు అయాన్‌, సనత్‌నగర్‌ అయాన్‌ డిజిటల్‌ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. 18న 456 మంది, 20న 480 మంది, 22న 614 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement