వడ్లు నేలపాలు
సి.బెళగల్: మండల పరిధిలోని పోలకల్ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన రైతు వెంకటేశ్వరమ్మకు చెందిన వడ్లను గుర్తుతెలియని దుండగులు నేలపాలు చేశారు. మహిళా రైతు తెలిపిన వివరాలు.. అర ఎకరంలో వరి సాగు చేసుకుంది. శుక్రవారం పంట కోత కోసి ధాన్యం దిగుబడులను కల్లంలో రాశిగా పోసి టార్పాలిన్లు కప్పి ఇంటికి వెళ్లింది. శనివారం అటుగా వెళ్తున్న రైతులకు దిగుబడుల రాశి చిందరవందర అయి ఉండటం గమనించి వెంకటేశ్వరమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె అక్కడికి చేరుకుని దిగుబడులు నేలపాలై ఉండటం చూసి బోరున విలపించింది. గిట్టని వారే వడ్లను ఇష్టం వచ్చినట్లు చల్లి నాశనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment