అధికారంలోకి వస్తే ప్రజలపై పైసా భారం ఉండదు..ఉన్నవాటినే త
వాణిజ్య సముదాయ
కనెక్షన్లు
79,624
గృహ వినియోగదారులు కనెక్షన్లు
6,83,233
వ్యవసాయ బోరు
కనెక్షన్లు
1,07,974
ఈ చిత్రంలోకనిపిస్తున్న వ్యక్తి హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందినసుంకన్న. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన విద్యుత్ సర్వీస్ నంబర్ 8112529000619. ఇంటికి వినియోగించిన 75 యూనిట్లకు రూ. 368 రాగా, ఇందులో ఫిక్స్‌డ్ చార్జీలు రూ.10, కస్టమర్ చార్జీలు రూ.30, సర్ చార్జస్ కింద రూ.25 ఎక్ట్రిసిటీ డ్యూటీ రూ.4.50 వేశారు. అయితే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ట్రూ అప్ చార్జీలు రూ 17.55, ఎఫ్‌పీపీఏ చార్జీలు (నవంబర్–2024) రూ.34, ఎఫ్‌పీపీఏ (2022–ఏప్రిల్) రూ.51 రూపాయలు భారం మోపింది. ‘మాలాంటి పేదలు తక్కువలో తక్కువైనా ప్రతి నెల రూ. 100 – రూ. 150 అదనంగా కట్టాలంటే భారమే’నని సుంకన్న చెబుతున్నాడు.
● ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు పిడుగు
● ఇంధనం, విద్యుత్ కొనుగోలు పేరిట
మరో వడ్డన
● జిల్లా ప్రజలపై నెలకు
రూ.13.2 కోట్ల భారం
● కూటమి సర్కారు విద్యుత్ బాదుడుపై
నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు లక్ష్మన్న. ఊరు ఆస్పరి. ఇతను ఉంటున్న ఇంటికి నవంబర్ నెల విద్యుత్ బిల్లు రూ.425 వచ్చింది. అందులో 98 యూనిట్ల వివినియోగించినట్లు ఉంది. డిసెంబర్ నెల బిల్లు గత నెల కంటే ఒక యూనిట్ తక్కువగా అంటే 97 యూనిట్లు వినియోగించినట్లు ఉంది. ఈ లెక్కన బిల్లు తగ్గాలి కానీ.. రూ. 52 అదనంగా రూ.477 వచ్చింది. గత మాసంతో పోల్చితే 10 శాతం బిల్లు అధికంగా రావడంతో ఇదేమి షాక్ అంటూ నిట్టూర్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment