ఫ్లెక్సీల తొలగింపు
డోన్: మహాత్మా మన్నించు శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు టీడీపీ నాయకులు స్పందించి తమ తప్పును సరిదిద్దుకున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ కాంస్య విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుల ఫ్లెక్సీల విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. దీతో టీడీపీ నాయకులు సోమవారం ఫెక్సీని తొలగించి వేరొక చోట ఏర్పాటు చేసుకోవడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
పట్టపగలే చోరీ
గడివేముల: మండల కేంద్రంలోని నంద్యాల–నందికొట్కూరు ప్రధాన రహదారిలో సీఎస్‌ఐ చర్చి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాలు.. సోమవారం గ్రామానికి చెందిన కురువ పెద్దన్న కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లారు. గమనించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 8 తులాల బంగారంతోపాటు రూ.13 వేలను ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చోరీ జరిగిందని నిర్ధారించుకుని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment