నాడు.. | - | Sakshi
Sakshi News home page

నాడు..

Published Thu, Jan 2 2025 1:36 AM | Last Updated on Thu, Jan 2 2025 1:36 AM

నాడు.

నాడు..

‘ఏమి సుబ్బన్న బాగున్నావా.. నొప్పి తగ్గిందా.. జ్వరమేమి రాలేదు కదా.. ఏమి కాదులే.. భయపడకు.. మందులు మరిచిపోవద్దు.. రేపు డిశ్చార్జ్‌ చేస్తాం ఊరికెళ్లు’. పిల్లలను బాగా చదివించు’. గతంలో కర్నూలు పెద్దాసుపత్రిలో రోగుల పట్ల వైద్యుల మాట తీరు ఇలా ఉండేది. నాడి పట్టి, బాధలు వింటూ వైద్యం

అందించేవారు. రోగికి మాత్రల కంటే డాక్టర్‌ పలకరింపు ఔషధంగా పని చేస్తుందని చెబుతూ ఎంతో మంది వైద్యులు ఈ ఆసుపత్రిలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ వారి పేర్లను ఆసుపత్రి వర్గాలు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాయి.

రోగులను ఆప్యాయంగా

పలకరించే వైద్యులు కరువు

నాడి పట్టని, బాధలు వినని వారెందరో

రోగి లక్షణాలను బట్టే వైద్యపరీక్షలు

టెస్ట్‌ల ఆధారంగానే చికిత్స

కర్నూలు ప్రభుత్వ సర్వజన

వైద్యశాలలో ఇదీ పరిస్థితి

కర్నూలు(హాస్పిటల్‌): పూర్వం రోజుల్లో ప్రతి ఒక్క డాక్టరూ రోగి నాడి పట్టుకుని పరిశీలించేవారు. ఏ నాడి ఎలా కొట్టుకుంటుందో గమనించి వ్యాధిని గుర్తించేవారు. ఓ మహిళ గర్భం దాల్చిందా లేదా అన్న విషయం కూడా ఎలాంటి స్కానింగ్‌ లేకుండా నాడి పట్టుకుని చిటికెలో చెప్పేసేవారు. మరికొందరు ఆపాద మస్తకం భౌతికంగా తట్టి, పట్టుకుని పరిశీలించి ఏ భాగంలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉందో ఇట్టే చెప్పేవారు. ఇప్పుడలాంటి వైద్యులే కరువయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి వైద్యుల వద్దకు వచ్చిన రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణా ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతిరోజూ 2వేల నుంచి 2,500ల దాకా ఓపీ రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా నిత్యం 1200 నుంచి 1500 మంది వరకు చికిత్స పొందుతూ ఉంటారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ దాదాపు 50 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణించి ఆసుపత్రికి చేరుకుంటారు. ఇలా ఇచ్చిన వారు ఓపీ కోసం అరగంట, డాక్టర్‌ వద్ద చికిత్స చేయించుకోవడానికి అరగంట, వ్యాధినిర్దారణ పరీక్షలకు గంట, వాటి నివేదికలు రావడానికి మరో గంట, మళ్లీ డాక్టర్‌ను కలవడానికి మరో గంట సమయం వెరసి మూడు, నాలుగు గంటలు ఎంతో ఓపికతో ఆసుపత్రిలో తిరిగి చికిత్స చేయించుకుని వెళ్తుంటారు. రోగులకు, ఎక్స్‌రే, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌ వంటి పరీక్షలు రాస్తే మరో రెండు, మూడు రోజుల తర్వాత చికిత్స కోసం రావాల్సిందే. రోగులను మర్యాదగా పలకరించాల్సిన కొందరు వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఉద్యోగుల గదిరింపులకు, మర్యాదలేని మాటలకు తీవ్ర అవమాన భారంతో కుంగిపోతున్నారు. కొందరు ఎదురుతిరిగి మాట్లాడి వైద్యులు, సిబ్బందితో గొడవపడుతున్నారు. ఒకవైపు రోగి చావు బతుకుల్లో ఉంటే వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోగా తిట్లదండకం మొదలుపెడుతున్నారని ప్రతిసారీ ఘర్షణలు పడుతున్నారు.

తిట్ల దండకం...సాధారణం

నేడు..

ఆ ఏమైంది.. ఊ.. ఊ.. ఆ..

అంటూ ఓపీ చీటీలో చకచక ఐదు మాత్రల పేర్లు.. నాలుగు టెస్ట్‌లు రాసి.. వారం తర్వాత రా.. ఇది నేడు కర్నూలు పెద్దాసుపత్రిలో కొందరి వైద్యుల తీరు. రోగి బాధ వినరు.. నాడి పట్టరు. ఇక వార్డులో చేరితే అంతే. డాక్టర్‌ రౌండ్‌కు వచ్చినా ఏమి చెప్పరు. వైద్యం అంతాకేషీట్‌లోనే ఉంటుంది. అధిక శాతం రోగులు చెప్పిన వ్యాధి లక్షణాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. వ్యాధినిర్ధ్దారణ పరీక్షల ఆధారంగానే పూర్తిస్థాయి చికిత్స ప్రారంభిస్తున్నారు. చాలా మంది రోగులు ఆసుపత్రిలో టెస్ట్‌లు చేయించుకునేందుకు మళ్లీ రాలేక భారమైనా ప్రైవేటు

ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కొందరు సీనియర్‌ నర్సులు తిట్ల దండకం ఆపడం లేదు. గ్రామీణ ప్రాంత రోగులను చూస్తే మరీ చులకనగా మాట్లాడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని గట్టిగట్టిగా అరుస్తూ మాట్లాడటం, వయస్సులో పెద్దవారిని కూడా ఏక వచనంతో సంబోధించడం చేస్తున్నారు. గైనకాలజీ విభాగంలో అయితే మరింత నీచంగా మాట్లాడుతున్నారని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సిస్టర్లు మనుషులుగా కూడా చూడటం లేదని, నొప్పులు వచ్చి అరిస్తే బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొందరు జూనియర్‌ వైద్యులు సైతం వ్యహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తిట్లదండకాన్ని కొందరు వీడియోలు తీసి వైరల్‌ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. వైద్యులు, నర్సులతో పాటు వార్డుల్లో విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది సైతం మరింత దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి మర్యాదచూపకుండా మాట్లాడుతూ అవమానిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడం వల్లే ఇక్కడ ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నాడు.. 
1
1/1

నాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement