నిర్మాణ రంగం కుదేలే..
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి తే నిర్మాణ రంగం కుదేలవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా దెబ్బతినడంతో ప్రభుత్వా నికి ఆదాయం తగ్గింది. ఈ సమయంలో స్థిర, చరాస్థుల విలువను పెంచడం అనాలోచిత నిర్ణయం. వ్యవసాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగమే అతి పెద్దది. దానిని ఆదుకోవడం కోసం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
– బ్రిజేష్ సింగ్, బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కర్నూలు
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు తగదు
ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీ లు చాలా ఎక్కువగా ఉన్నా యి. రెండు, మూడు సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రూ.40 వేలకు చేరుకుంటుంది. పట్టణాల్లో రూ.60 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉంటుంది. ఈ సమయంలో రేట్లను పెంచితే ఆ విలువలు మరింత ఎక్కువై ప్రజలపై భారం పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణమే ఉప సంహరించుకోవాలి. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది.
– రజనీకాంత్ రెడ్డి,
రియల్ ఎస్టేట్ వ్యాపారి, కర్నూలు
పెంచిన విలువల ఆధారంగానే
రిజిస్ట్రేషన్లు
జిల్లాలో శనివారం నుంచి పెరిగిన విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేస్తారు. క్రయ, విక్రయదారులు సహకరించాలని కోరుతున్నాం. సరాసరిగా 20 నుంచి 45 శాతం వరకు విలువలు పెరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలలు మదింపు చేసి ప్రజలకు భారం లేకుండా విలువలు పెంచాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.
–ఎం. చెన్నకేశవరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్, కర్నూలు
●
Comments
Please login to add a commentAdd a comment