త్వరలో మానుకోటలో మహాధర్నా
మహబూబాబాద్: మహబూబాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి ని రాకరించారని, త్వరలోనే హైకోర్టు అనుమతితో మహాధర్నా నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మానుకోట ధర్నా విషయంలో పోలీస్‌లు, కాంగ్రెస్ హైడ్రామా బట్టబ యలైందన్నారు. లగచర్ల ఘటన గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేందుకే మానుకోట మహాధర్నాకు పిలుపునిచ్చామని, ధర్నాకు అనుమతి ఇవ్వకపోగా 144 సెక్షన్ విధించి మానుకోటలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాళ్లతో కొడతామని మాట్లాడిని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లగచర్లతోనే సీఎం రేవంత్‌రెడ్డి కౌన్ డౌన్ ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత , మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న, నాయకులు యాకూబ్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, రవికుమార్, వెంకన్న, కన్నా, అశోక్, రంజిత్, ఫరీద్ ఉన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
Comments
Please login to add a commentAdd a comment