అరవింద్ ఆర్యపకిడేకు ‘చేంజ్ మేకర్’ అవార్డు ప్రదానం
హన్మకొండ కల్చరల్ : చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు వరంగల్ నగరానికి చెందిన టార్చ్ సంస్థ వ్యవస్థాపకులు అరవింద్ ఆర్యపకిడే ‘చేంజ్ మేకర్’ అవార్డు అందుకున్నారు. రేస్ టూ విన్ ఫౌండేషన్, డెమోక్రటిక్ సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో మార్పు కోసం పాటు పడిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేంజ్ మేకర్ అవార్డులను ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా ఎంపీ జి.రేణుకాచౌదరి, గౌరవ అతిఽథులుగా మిస్‌యూనివర్స్ 1994 సుస్మితాసేన్, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజికవేత్త స్వామి అగ్నివేష్‌కు నివాళులర్పించారు. అనంతరం డెమెక్రటిక్ సంఘ్ వ్యవస్థాపకురాలు, సినీ హీరోయిన్ రెజీనా.. అరవింద్ ఆర్యపకిడేకు చేంజ్ మేకర్ అవార్డు ప్రదానం చేశారు.
డీసీఎం, లారీ డ్రైవర్ల మధ్య లొల్లి
వరంగల్ చౌరస్తా: వరంగల్ లోకోషెడ్ నుంచి ఫెర్టిలైజర్స్ దిగుమతుల విషయంలో కొద్ది నెలలుగా డీసీఎం, లారీ డ్రైవర్ల మధ్య వివాదం నెలకొంది. దీంతో శుక్రవారం డీసీఎం యజమానులు, డ్రైవర్లు వరంగల్ పాత అజాంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం వల్లనే సమస్య జఠిలమై ఓ యూనియన్ రోడ్డు ఎక్సాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment