టీజీబీగా ఏపీజీవీబీ బ్రాంచ్‌లు
హన్మకొండ: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికా స్ బ్యాంక్ బ్రాంచ్‌లు ఇక నుంచి తెలంగాణ గ్రామీ ణ బ్యాంకులు(టీజీబీ)గా పని చేస్తాయి.. 2025 జనవరి 1 నుంచి పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయని ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాప్ రెడ్డి చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని బ్యాంకు వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని 493 ఏపీజీవీబీ బ్రాంచీలు టీజీబీలో విలీనమవుతున్న క్రమంలో ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. ఈ నాలుగు రోజుల పాటు సేవల అంతరాయానికి చింతిస్తున్నామని, ఖాతాదారుల నంబర్లు మారవని, చెక్కు బుక్కులు, పాస్ బుక్కులు కొత్తవి ఉచితంగానే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు సేవల నిలిపివేతపై బ్యాంక్ వెబ్‌సైట్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాతో పాటు ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం చేరవేసినట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఏపీజీవీబీ జనరల్ మేనేజర్ ఆపరేషన్ బి.దయాకర్, రీజినల్ మేనేజర్ జి.పి.ఎస్.చైతన్య కుమార్, చీఫ్ మేనేజర్ యశ్వంత్, మేనేజర్ (ఆపరేషన్) కె.వెంకటచారి పాల్గొన్నారు.
2025 జనవరి 1 నుంచి సేవలు
బ్యాంకు చైర్మన్ కె.ప్రతాప్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment