నేరాలకు పాల్పడితే చర్యలు
వరంగల్ క్రైం: నగరంలో నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హనుమకొండ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. శుక్రవారం హనుమకొండ (సుబేదారి) హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏపీపీ దేవేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీల్లో పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రహదారులపై వాహనాలను తనిఖీ చేసి వాహన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. మైనర్ బాలురు వాహనాలు నడపడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు డ్రగ్స్, గంజాయి ఇతర నేరాలు జరుగుతున్నాయని అన్నారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. కాలనీ లో అనుమానాస్పదంగా ఎవరైన వ్యక్తులు కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సుబేదారి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ, యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్లు సతీష్, రవికుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్లు 10మంది, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
సెంట్రల్‌జోన్ డీసీపీ షేక్ సలీమా
Comments
Please login to add a commentAdd a comment