మహబూబాబాద్ రూరల్: మహిళపై దాడి చేసిన కేసులో నలుగురికి జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తూ మహబూబాబాద్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తిరుపతి శుక్రవారం తీర్పునిచ్చారు. కోర్టు డ్యూటీ అధికారి తాజీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగులగూడెం గ్రామ శివారు జుజురు తండాకు చెందిన ఇస్లావత్ లక్ష్మి తమ పత్తి చేను చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. కొందరు వ్యక్తులు కంచెను తొలగించి పశువులను మేపడంతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో కంచెను తొలగించడంపై లక్ష్మీ స్థానిక రైతులను అడగగా.. బానోతు కస్న, బానోతు పూల, బానోతు పద్మ, బానోతు కులియ కలిసి అసభ్యకర పదజాలంతో దూషిస్తూ 2020 జూన్‌లో దాడిచేసి గాయపరిచారు. దీంతో లక్ష్మీ కుమారుడు ఇస్లావత్ రాజేందర్ సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్‌లో మహబూబాబాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలత కోర్టులో వాదనలు వినిపించగా ప్రస్తుత సీరోలు ఎస్సై నగేశ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి తాజీమ్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలువిన్న అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తిరుపతి పై విధంగా తీర్పు వెలువరించారు.
రూ.1,500 చొప్పున జరిమానా
Comments
Please login to add a commentAdd a comment