విద్యుదాఘాతంతో యువకుడి మృతి
తరిగొప్పుల: హార్వెస్టర్ యంత్రం మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం జనగామ జిల్లా తరి గొప్పుల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తరిగొప్పులకు చెందిన అనుకేశ్ బన్నీ(18) ఇదే గ్రామానికి చెందిన మోటం మొగిళికి చెందిన వరికోత మిషన్ మరమ్మతు కోసం వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ తీగలు సరిచేస్తున్నాడు. ఈక్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో మొగిళి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీదేవి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని సూచించగా తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదన్నారు.
బైక్ పైనుంచి పడి వ్యక్తి..
కొడకండ్ల: బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని హక్యాతండా గ్రామ పంచాయతీ పరిధి వెలిశాల శివారులో శుక్రవారం చోటు చేసుకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గాంధీనగర్‌కు చెందిన పందుల నగేశ్(40) బైక్‌పై కొడకండ్ల వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెల్సుకున్న ఎస్సై చింత రాజు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment