సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్‌ఓ మురళీధర్
కేసముద్రం: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ మురళీధర్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ మేరకు రికార్డులను పరీశీలించి, స్టాఫ్ వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరాదీశారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్టాఫ్ నర్స్‌ను డిప్యూటేషన్‌పై ఇస్తామని తెలిపారు. సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నంబీకిషోర్, వైద్యులు విజయ్‌కుమార్, సురేష్, సీహెచ్‌ఓ సాజిద్ హుస్సేన్, ఎస్‌యూఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు సరికాదు
● సీపీఎం కేంద్ర కమిటీ
సభ్యుడు నాగయ్య
నెహ్రూసెంటర్: రాజ్యాంగం, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వాఖ్యలు చేయడం సరికాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ, మండల కమిటీ సభ్యుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల మనోభావాలు, పార్లమెంట్ ప్రతిష్టను అగౌరవపర్చడమంటే రాజ్యాంగ విలువలను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను హేళన చేయడం సరి కాదన్నారు. దేశ ప్రజలను మరింత దరిద్రంలోకి దిగజార్చే ప్రయత్నంలో భాగమే జమిలి ఎన్నికలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల ఎజెండాను పక్కదారి పట్టించేందుకే పార్లమెంట్ సమావేశాల సమయం వృధా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ీసీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, గునిగంటి రాజ న్న, ఆకుల రాజు, కందునూరి శ్రీనివాస్, కుంట ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
నల్లతామర పురుగు
నివారణకు సస్యరక్షణ చర్యలు
గార్ల: మిర్చితోటలో నల్లతామర పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై మహబూబాబాద్ ఏడీఏ అజ్మీర శ్రీనివాస్ రైతులకు వివరించారు. శనివారం మండలంలోని ముల్కనూరు గ్రామంలోని ఓ రైతు మిర్చితోటలో ఆయన క్షేత్ర ప్రదర్శన చేశారు. తోటల్లో నల్లతామర పురుగు నివారణకు జిగురు పూసిన పసుపు, తెలుపు, నీలిరంగు అట్టాలను ఎకరాకు 20చొప్పున తోటలో అమర్చుకోవాలని సూచించారు. ఏఓ కావటి రామారావు, ఏఈఓ మేఘన పాల్గొన్నారు.
మళ్లీ పెద్దపులి సంచారం?
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండలంలోని లవ్వాల బీట్ పరిధి బంధాల దేవునిగుట్ట అడవిలో శనివా రం పెద్దపులి సంచరించింది. గత కొద్ది రోజుల క్రితం దా మెరవాయి అడవిలోని వట్టివాగు, నర్సాపూర్, గౌరారం వాగు బ్రిడ్జి కింద నుంచి పెద్దపులి సంచరించిన పాదముద్రలను అధికారులు గుర్తించారు. గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతంలో పులి పా దముద్రలను అక్కడి అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అయితే శనివారం తాడ్వాయి మండలంలోని బంధాల దేవునిగుట్ట ప్రాంతంలో పెద్దపులి మళ్లీ తిరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు మాత్రం పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు ధ్రువీకరించడం లేదు. ఇదే విషయంపై సెక్షన్ ఆఫీసర్ సజన్‌లాల్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment