నాసిరకం అయోడిన్‌తో అనారోగ్యం
ఖిలా వరంగల్: నాసిరకం అయోడిన్‌తో అనేక ఆరోగ్య సమస్య ఉత్పన్నమవుతున్నాయని, వెంటనే నిషేధించాలని సీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్, మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి డిమాండ్ చేశారు. ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు తనిఖీల్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఈమేరకు ఆదివారం వరంగల్ శివనగర్‌లోని వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో హైకోర్టు న్యాయవాది మురారి శెట్టి యశ్వంత్‌కుమార్, జిల్లా న్యాయవాది బండి అనిల్‌కుమార్ అధ్యక్షతన వినియోగదారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మైక్రో ప్లాస్టిక్ కవర్‌లోని నిల్వ అయోడిన్ హానికరమన్నారు. ఆయోడిన్ లోపంతో గర్భిణులు, పిల్లలు తీవ్ర మానసిక రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్‌లోని నిల్వ ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవాలన్నారు. సమావేశంలో రావుల రంజిత్‌కుమార్, చిలివేరు ప్రవీణ్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.
మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి
Comments
Please login to add a commentAdd a comment