చారకొండ: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడిని ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగూరు మండల కేంద్రానికి చెందిన నారమోని శ్రీను(40) కొంత కాలంగా చింతపల్లి మండలం కుర్మేడులో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతనికి సొంత లారీ ఉండటంతో తానే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10న లారీ లోడ్‌తో కర్ణాటక వెళ్లారు. తిరిగి వచ్చిన డ్రైవర్ శ్రీను ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై కుర్మేడుకు వెళ్తుండగా.. చారకొండ మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న చారకొండ పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని మృతుని వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు తెలిపి, పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలియజేశారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మృతదేహం లభ్యం
వనపర్తి రూరల్: మండలంలోని అప్పాయిపల్లి శివారులోని మశమ్మ చెరువులో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు వనపర్తి రూరల్ ఎస్‌ఐ జలేందర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి మండలంలోని అప్పాయిపల్లి గ్రామ శివారులోని మశమ్మ చెరువులో ముళ్లపొదలో నీటిపై తేలియాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని పంచాయతీ కార్యదర్శి ఉమ్మాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. దాదాపు 10 నుంచి 20 రోజుల కింద ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. మృతదేహం ముళ్లపొదలో ఉండటంతో ఎవరూ గమనించలేదన్నారు. మృతదేహాన్ని వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైన మృతదేహాన్ని గుర్తిస్తే వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment