పోలీసులు ప్రగతికి బాటలు వేయాలి
జడ్చర్ల: సమసమాజ ప్రగతికి పోలీసులు బాటలు వేయాలి, మార్గ నిర్దేశకులు కావాలి, ప్రజలతో స త్సంబంధాలు కలిగి వారి కన్నీళ్లు తుడువాలి, పోలీసుశాఖ ఖ్యాతిని జాతీయ, రాష్ట్రీయస్థాయిలో నిలపాలని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువా రం జడ్చర్ల డీటీసీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 270మంది పోలీసులు శిక్షణ ముగించుకుని వెళుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. పోలీసు ఉద్యోగం అంటే ఇతర ఉద్యోగాల మాదిరి కాదని, కుటుంబ ధర్మం కంటే వృత్తి ధర్మమే ముఖ్యంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవల కు భిన్నంగా పోలీసుల సేవలు ఉంటాయని తెలిపారు. డీటీసీలో 9 నెలల పాటు శిక్షణలో నేర్చుకు న్న అంశాలను క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు పరుచాలన్నారు. పోలీసు యూనిఫాంకు అత్యున్న త గౌరవం ఉందని, ఎన్నో బాధలు, సమస్యలతో వచ్చే ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. అన్ని దారులు మూసుకుపోయి విధిలేని పరిస్థితులలో పోలీసులను ఆశ్రయిస్తారని అన్నారు. ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడిని ఎలా నమ్ముతారో అదేతరహాలో పోలీసులను నమ్ముతారని, బాధితుల కష్టా లను భుజాన వేసుకుని న్యాయం చేయాలన్నారు. శాంతి, రక్షణ లేనిది ఎలాంటి అభివృద్ధి జరగదన్నా రు. ఆ దిశగా పోలీసులు ముందుకు సాగాలని తెలిపారు. ప్రజల మధ్యనే పోలీసులు తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని, పోలీసుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పడు గమనిస్తుంటారని అన్నారు. చిన్న తప్పు జరిగినా దాని ప్రభావం పోలీస్‌శాఖపై చూపుతుందన్నారు. పోలీసుల త్యాగాలకు విలువ కట్టలేమని, ప్రజల ప్రాణాలకు, మానాలకు, ఆస్తులకు పోలీసులు తమ కుటుంబాలను విడిచి భద్రత కల్పిస్తున్నారని అన్నారు. శిక్షణలో అవుట్ డోర్, ఇండోర్ సిబ్బంది పనితీరు ప్రశంసనీయమని తెలిపారు. శిక్షణ చాలా ముఖ్యమని, శిక్షణ ఫలితాల కారణంగానే ఎన్నో కొత్త విషయాలతో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి, గద్వాల ఎస్పీ గిరిధర్, డీటీసీ ప్రిన్స్‌పాల్ రాములు, ఏఆర్ ఏఎస్పీ సురేష్ కుమార్, వైస్ ప్రిన్స్‌పాల్ నర్సిములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవలతో ప్రజల మన్ననలుపొందాలి
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
డీజీపీ కే.శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment