అధికారుల పర్యవేక్షణలో వండినా..
ఇదిలా ఉండగా, స్వయంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాగనూర్ పాఠశాలను సందర్శించి స్టాక్‌రూంలోని బియ్యాన్ని పరిశీలించారు. ఆ సమయంలో బియ్యంలో కలెక్టర్‌కు పురుగులు కనిపించలేదు. అయితే, అనంతరం అధికారుల పర్యవేక్షణలో హాస్టల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం వండారు. సదరు అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్నం తినకుండా పారబోసి ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ను ఇక్కడి అధికారులు తప్పుదోవ పట్టించారా.. వండే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనేది విచారణ చేపడితే తప్పా బయటపడదంటూ వాపోయారు. చివరికి అధికారులు బియ్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలకు మరోమారు అన్నం వండి విద్యార్థులకు పెట్టారు. గురువారం వండిన అన్నంలో మరోసారి పురుగులు రావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డీఈఓ అబ్దుల్‌ఘనిను సస్పెండ్ చేశారు. అలాగే ఆర్డీఓ, ఎంపీడీఓ, పుడ్ ఇన్‌స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అన్నంలో పురుగులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా అని ప్రశ్నించారు. ఆయన సొంత డబ్బులతో బియ్యం కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment