అల్పాహారంలో పురుగులపై విచారణ
జెడ్పీసెంటర్/పాలమూరు: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు గురువారం అందించిన అల్పాహారం రైస్ పొంగల్‌లో పురుగులు ఉన్నట్లు వచ్చిన వార్తలపై కలెక్టర్ విజయేందిర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆస్పత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడా రు. అల్పాహారంపై విచారించారు. ఆహార పదార్థాలను ల్యాబ్ టెస్ట్‌కు పంపించాలని ఆదేశించారు. టిఫిన్‌లో పురుగులు ఉన్నట్లు ఓ విద్యార్థిని ఆస్పత్రి వార్డు నర్సు దృష్టికి తీసుకురాగా.. వెంటనే సదరు నర్సు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి, రైస్ పొంగల్‌కు బదులు ఉప్మా అందించినట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. స్టోర్‌రూంలో ఉన్న బియ్యం, పప్పులు పరిశీలించగా.. ఎలాంటి పురుగులు కనిపించలేదని, వాటిని తిరిగి నాణ్యత పరీక్షలకు పంపినట్లు వివరించారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లోపం లేదని ల్యాబ్ టెస్ట్‌లో ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని అడిషనల్ కలెక్టర్‌తో పాటు అధికారులు స్వయంగా రుచి చూశారు. డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది రోజూ రోగులకు అందించే టిఫిన్, భోజనం స్వీకరిస్తారని తెలిపారు. ఆర్డీఓ నవీన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ ఉన్నారు.
ఆహార పదార్థాల్లో నాణ్యత లోపం లేదని ప్రాథమికంగా నిర్ధారణ
Comments
Please login to add a commentAdd a comment