నాణ్యమైన భోజనం అందించని దుస్థితిలో ప్రభుత్వం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాగనూరు విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్పత్రుల్లో మందులు, వైద్యుల కొరత ఏర్పడిందని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వారి పిల్లలు ఇలాంటి భోజనమే తింటున్నారని అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం, విద్యార్థుల ఆరోగ్యం, చదువు గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆరోపించారు. వారివెంట మాజీ ముడా చైర్మన్ వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, వర్త భాస్కర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment