కోస్గి: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో గుండుమాల్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్–19 వాలీబాల్ పోటీలు రెండోరోజు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. స్థానిక ఏకే అకాడమీ క్రీడామైదానంలో బుధవారం సెమీ ఫైనల్ పోటీలు నిర్వహించారు. గురువారం ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
రెండో రోజు విజేతలు..
రెండోరోజు జరిగిన పోటీల్లో మహబూబ్‌నగర్ బాలుర జట్టు మెదక్ జట్టుపై 25–12, 25–17 స్కోర్‌తో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు నల్గొండ జట్టుపై 25–19, 25–23 స్కోర్‌తో విజయం సాధించింది. ఖమ్మం జట్టు అదిలాబాద్ జట్టుపై 27–25, 25–19 స్కోర్‌తో విజయం సాధించింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు ఖమ్మం జట్టుపై 15–9, 15–2 స్కోర్‌తో విజయం సాధించింది. నల్గొండ జట్టు వరంగల్ జట్టుపై 16–14, 15–7 స్కోర్‌తో విజయం సాధించింది. మహబూబ్‌నగర్ జట్టు ఆదిలాబాద్ జట్టుపై 15–3, 15–3 స్కోర్‌తో విజయం సాధించింది. కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాల్‌రాజ్, పీడీలు శ్రీనివాస్, నర్సింహులు, రాధిక, స్వప్న, పుష్పలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment