అండర్–14 టోర్నీలో జిల్లా జట్టు శుభారంభం
● రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
● మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ
జడ్చర్ల టౌన్: పోలీస్ స్టేషన్‌లో అధిక కేసులు నమోదవుతున్నందున ఆస్తి సంబంధిత నేరాలు, వ్యక్తిగత దాడులు చేసిన నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచి వారిపై నిఘా ఉంచాలని మల్టీజోన్– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. నేరస్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. జడ్చర్ల మీదుగా 44, 167 జాతీయ రహదారులు వెళ్తున్నందున ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుచేయాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాయామం, యోగ, ధ్యానం, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు, విధుల గురించి సీఐ ఆదిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఐజీతో పాటు జిల్లా ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఐజీ సత్యనారాయణ
ఇసుక గుంతలో
పడి వ్యక్తి మృతి
రాజాపూర్: చేపలు పట్టేందుకు వెళ్లి ఇసుక గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బాలస్వామి (30) అమ్మగారి గ్రామం రాజాపూర్ మండల కేంద్రానికి వచ్చి సోమవారం గ్రామ శివారులోని దుందుభి వాగులోని ఇసుక గుంతలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అదే గుంతలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు మృతి చెందిన విషయాన్ని కొందరు ఇసుక మాఫియా దృష్టికి తీసుకెళ్లగా వారు విషయం బయటికి పొక్కకుండ మృతదేహాన్ని బయటికి తీసి పోలేపల్లికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇసుక మాఫియా దుందుభి వాగులో కృత్రిమ ఇసుక తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన గుంతల్లో పడి పలువురు మృతి చెందుతున్నట్లు ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగిస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
వణికిస్తున్న చలి
జడ్చర్ల టౌన్: జిల్లాలో ప్రజలను చలి వణికిస్తుంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆది, సోమవారాల్లో ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదు కాగా.. సాయంత్రం వేళకే ఇళ్లకు చేరుకుని చలి నుంచి రక్షించుకుంటున్నారు. అయితే వృద్ధులు, చిన్నారులు మాత్రం చలితో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన హెచ్‌సీఏ అండర్–14 బాలుర స్కూల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి జిల్లా జట్టు శుభారంభం చేసింది. వన్ చాంపియన్–2 గ్రౌండ్‌లో సోమవారం ఎస్‌టీ ఆంథోనీస్ హైస్కూల్– హిమాయత్‌నగర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 445 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 47 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 468 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో మొదటి డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జి.కేతన్‌కుమార్ డబుల్ సెంచరీతో రాణించాడు. 136 బంతుల్లో 26 ఫోర్లు, 1 సిక్స్‌తో 235 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతర బ్యాట్స్‌మెన్లు శ్రీహర్షిత్ (75 నాటౌట్), ఎ.హర్షిత్ 62 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌టీ ఆంథోనీస్ జట్టు మహబూబ్‌నగర్ జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 11.1 ఓవర్లలో 23 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్ సోహైల్ 5.1 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లు, వెంకటసాగర్ 3 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు.
ఎండీసీఏ అభినందనలు..
హెచ్‌సీఏ అండర్–14 స్కూల్ టోర్నీలో మొదటి మ్యాచ్‌ను ఉమ్మడి జిల్లా జట్టు గెలుపొందడంపై మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా టోర్నీలో మొదటి మ్యాచ్‌ను గెలుపొంది శుభారంభం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో విజయాలు సాధించి టోర్నీ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.
సోహైల్
(6 వికెట్లు)
కేతన్‌కుమార్ (235 పరుగులు నాటౌట్)
ఇసుక మాఫియావల్లనే అంటున్న గ్రామస్తులు
445 పరుగుల భారీ తేడాతో ఎస్‌టీ ఆంథోనిస్ జట్టుపై విజయం
డబుల్ సెంచరీ సాధించిన కేతన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment