దోమలపెంట: భూగర్భ కేంద్రంలో పంప్మోడ్ పద్ధతిలో 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఆనకట్ట దిగువన నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఆనకట్ట ఎగువన శ్రీశైలం జలాశయంలోకి 8,798 క్యూసెక్కుల నీటిని (ఎత్తిపోతల) తరలించారు. పోతిరెడ్డిపాడు ద్వారా 1,500 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,631, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రం వరకు శ్రీశైలం జలాశయంలో 863.8 అడుగుల వద్ద 118.0544 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment