గర్భాలయంలో కొలువుదీరిన బాలబ్రహ్మేశ్వరుడికి భక్తులు 11పర్యాయాలు ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఓం నమోఃశివాయ అంటూ భక్తులు మహాశివ పంచాక్షరిని స్మరిస్తూ అభిషేకాలు చేస్తుండగా వేదపండితులు రుద్ర నామక చమకాలను వల్లవేశారు. వివిధ రకాల పండ్ల రసాలు, పంచామృతాలు, మంగళద్రవ్యాలతో అభిషేకించారు. అన్నసూక్త పఠనంతో స్వామివారికి స్వేతాన్నంతో అభిషేకాలు జరిగాయి. అన్నాన్ని లింగాకృతిలో అలంకరించి బిల్వాదళాలు, వివిధ రకాల పూలతో అష్టోత్తర అర్చనలు చేశారు. పంచభక్ష పరమాన్నాలతో మహా నైవేద్యాలు చేశారు. ఏక, నేత్ర, బిల్వ, వేద, కర్పూర, పంచక, రథ, చక్ర, కుంభ, నక్షత్ర హారతులను శవిధ నీరాజనాలు సమర్పించారు. ఆరుద్రోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆరుద్రోత్సవ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ భక్తులకు వివరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment