18 క్వింటాళ్ల రేషన్ పట్టివేత
ఆత్మకూర్: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో ఎరుకలి నాగరాజు తన ఇంట్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచాడన్న సమాచారంతో ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. దాడిలో 18 క్వింటాళ్ల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ వేణుగోపాల్ బృందం పంచనామా నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పొలం విషయంలో ముగ్గురిపై దాడి
అడ్డాకుల: పొలం విషయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలైన ఘటన అడ్డాకుల మండలం కందూర్ శివారులో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన శేరి సంజీవ సోదరి వ్యవసాయ పొలం కందూర్ శివారులో ఉంది. పొలం వద్ద పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సంజీవ, శివ, శ్రీనులపై అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రామలింగం, రాములు, జయంతి, శ్రీనుతో పాటు మరొకరు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. దాడిలో సంజీవకు తీవ్రగాయమైంది. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు. దాడి విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment