కోలాహలంగా పాల ఉట్లు
● పోటెత్తిన జనం
మక్తల్: పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పడమటి ఆంజనేయ ప్రాంగణంలో సోమవారం పాల ఉట్లు కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. పాల ఉట్లు సందర్భంగా భక్తులు కోలాటం, చిన్నారులు దాండీయ నృత్యాలు. ఆడుగుల భజనలు చేస్తూ ఊరేగింపుతో వెళ్లారు. ఈసారి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. పాల ఉట్లు కార్యక్రమం పోటాపోటీగా సాగింది. మక్తల్‌కు చెందిన కొంతమంది యువకులు సహాయంతో ఒక యువకుడు పైకి ఎక్కి ఉట్టిని కొట్టాడు. పలువురు అత డిని అభినందించారు. సాయంత్రం పట్టణంలో పల్లకీసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కు లు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా రావ డంతో అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి భక్తులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment