వైభవంగా అంజన్న రథోత్సవం
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి రథోత్సవం సోమవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా సాగింది. అంజన్న నామస్మరణతో జాతర మైదానం మార్మోగిపోయింది. కన్నులు మిరుమిట్లు గొలిపేలా బాణసంచాను కాల్చారు. భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పలువురు మహిళలు పూనకాలతో ఊగిపోయారు. జాతరకు వివిధ ప్రాంతాలనుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. పలువురు భక్తులు దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. గండజ్యోతులతో, పొర్లు దండాలతో ఇంటి దేవుడిని కొలిచారు. పలువురు కోడేలను, ఆవులను ఆలయానికి అందజేశారు.
జోరుగా వ్యాపారాలు..
జాతరలో వ్యాపారాలు జోరుగా సాగాయి. జిలేబీలు, ఇతర స్వీట్లను భక్తులు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. గాజుల, బొమ్మల దుకాణాలు కిటకిటలాడాయి. చిన్నారులకు సంబంధించిన రంగుల జాయింట్ వీల్, ట్రైన్, ఇంకా పలు ఆటలకు సంబంధించిన ఏర్పాటుచేశారు. జాతర ఉత్సవాలు రెండు వారాల పాటు కొనసాగుతాయి.
దేవాలయం వద్ద
స్వామి దర్శనానికి
బారులు తీరిన భక్తులు
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
ఆంజనేయ నామస్మరణతో మార్మోగిన జాతర మైదానం
Comments
Please login to add a commentAdd a comment